English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

1 Kings Chapters

1 రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్నిబట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక యుండెను.
2 కాబట్టి వారుమా యేలినవాడవును రాజవునగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది; ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి
3 ఇశ్రా యేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి, అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసికొని వచ్చిరి.
4 ఈ చిన్నది బహు చక్కనిదై యుండి రాజును ఆదరించి ఉపచారము చేయు చుండెను గాని రాజు దానిని కూడలేదు.
5 హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించిన వాడైనేనే రాజు నగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్ప రచుకొనెను.
6 అతని తండ్రినీవు ఈలాగున ఏల చేయు చున్నావని అతనిచేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌంద ర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు.
7 అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని
8 యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.
9 అదోనీయా ఏన్‌రోగేలు సమీప మందుండు జోహెలేతు అను బండదగ్గర గొఱ్ఱలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి, రాజకుమారు లగు తన సహోదరులనందరిని యూదావారగు రాజు యొక్క సేవకులనందరిని పిలిపించెను గాని
10 ప్రవక్తయగు నాతానును బెనాయనును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు.
11 అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబతో చెప్పిన దేమనగాహగ్గీతు కుమారుడైన అదోనీయా యేలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మనయేలినవాడైన దావీదునకు తెలియకయే యున్నది.
12 కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను వినుము.
13 నీవు రాజైన దావీదునొద్దకు పోయినా యేలినవాడా, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చితివే; అదోనీయా యేలుచుండుట యేమని అడుగవలెను.
14 రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీవెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను.
15 కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టు చుండెను.
16 బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజునీ కోరిక ఏమని అడిగి నందుకు ఆమె యీలాగు మనవి చేసెను
17 నా యేలిన వాడా, నీవు నీ దేవుడైన యెహోవాతోడని నీ సేవకు రాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారు డైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే,
18 ఇప్పుడైతే అదోనీయా యేలుచున్నాడు. ఈ సంగతి నా యేలినవాడవును రాజవునగు నీకు తెలియకయే యున్నది.
19 అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱలను బలిగా అర్పించి రాజ కుమారులనందరిని యాజకుడైన అబ్యాతారును సైన్యాధి పతియైన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు.
20 నా యేలినవాడవైన రాజా, నా యేలినవాడవైన రాజవగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందునుగూర్చి ఇశ్రాయేలీయు లందరును కనిపెట్టియున్నారు.
21 ఇదిగాక నా యేలినవాడ వైన రాజవగు నీవు నీ పితరులతోకూడ నిద్రపొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అప రాధులముగా ఎంచబడుదుము.
22 ఆమె రాజుతో మాట లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికిరాగాప్రవక్తయగు నాతాను వచ్చి యున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి.
23 అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి
24 నా యేలినవాడవైన రాజా, అదోనీయా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనముమీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా?
25 ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన యెడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచురాజైన అదోనీయా చిరంజీవి యగునుగాక అని పలుకుచున్నారు.
26 అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహో యాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు.
27 నా యేలినవాడ వును రాజవునగు నీ తరువాత నీ సింహాసనముమీద ఎవడు ఆసీనుడై యుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పక యుందువా? ఈ కార్యము నా యేలినవాడవును రాజవు నగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా? అని యడిగెను.
28 దావీదు బత్షెబను పిలువుమని సెలవియ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను.
29 అప్పుడు రాజు ప్రమాణ పూర్వకముగా చెప్పినదేమనగాసకలమైన ఉపద్రవములలోనుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు
30 అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసినదానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా
31 బత్షెబ సాగిల పడి రాజునకు నమస్కారము చేసినా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను.
32 అప్పుడు రాజైన దావీదుయాజకుడైన సాదోకును ప్రవక్త యైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనా యాను నాయొద్దకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి.
33 అంతట రాజుమీరు మీ యేలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారు డైన సొలొమోనును నా కంచర గాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి
34 యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసిరాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను.
35 ఇశ్రాయేలు వారిమీదను యూదావారిమీదను నేనతనిని అధికారిగా నియమించి యున్నాను గనుక పిమ్మట మీరు యెరూష లేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనముమీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను.
36 అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజు నకు ప్రత్యుత్తరముగా ఇట్లనెనుఆలాగు జరుగును గాక, నా యేలినవాడవును రాజవునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక.
37 యెహోవా నా యేలిన వాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగానుండి, నా యేలినవాడైన రాజగు దావీదుయొక్క రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను;
38 కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయు లును రాజైన దావీదు కంచరగాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా
39 యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరునురాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని కేకలువేసిరి
40 మరియు ఆ జనులందరును అతని వెంబడివచ్చి పిల్లనగ్రోవులను ఊదుచు, వాటి నాదముచేత నేల బద్దలగునట్లు అత్యధిక ముగా సంతోషించిరి.
41 అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము వినిపట్టణమునందు ఈ అల్లరి యేమని యడుగగా
42 యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయాలోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా
43 యోనాతాను అదోనీయాతో ఇట్లనెనునిజముగా మన యేలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు.
44 రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనా యానును కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచరగాడిదమీద అతని నూరే గించిరి;
45 యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి; అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు; అందువలన పట్టణము అల్లరి ఆయెను; మీకు వినబడిన ధ్వని యిదే.
46 మరియు సొలొమోను రాజ్యాసనముమీద ఆసీనుడై యున్నాడు;
47 అందుకై రాజు సేవకులు మన యేలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటె సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచముమీద సాగిలపడి నమ స్కారము చేసి యిట్లనెను
48 నేను సజీవినై యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనముమీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను.
49 అందుకు అదోనీయా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.
50 అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.
51 అదోనీయా రాజైన సొలొ మోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనిరాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా
52 సొలొమోను ఈలాగు సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగుపరచుకొనిన యెడల అతని తల వెండ్రుకలలో ఒకటైనను క్రిందపడదు గాని అతనియందు దౌష్ట్యము కనబడిన యెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి
53 బలిపీఠమునొద్దనుండి అతని పిలువనంపించెను; అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితోనీ యింటికి పొమ్మని సెలవిచ్చెను.
×

Alert

×